E-Vissa: ఉక్రెయిన్లో భారతీయులకు ఈ-వీసా మళ్లీ ప్రారంభం 1 y ago
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వశాఖ భారత్, భూటాన్, మాల్దీవులు, నేపాల్ సహా 45 దేశాల పౌరులకు ఈ-వీసా జారీని మళ్లీ ప్రారంభించింది. ఫిబ్రవరి 19, 2025 నుండి దరఖాస్తులను స్వీకరించనుంది. టూరిజం, వ్యాపారం, విద్య, క్రీడలు, వైద్య చికిత్స వంటి ప్రయోజనాల కోసం ఒక్కసారి ప్రవేశానికి 20 డాలర్లు, రెండు సార్లు ప్రవేశానికి 30 డాలర్ల వీసా అందుబాటులో ఉంది. అత్యవసర వీసాలకు రెట్టింపు ఫీజు వసూలు చేస్తారు.